- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో అనుదీప్ కె.వి. నెక్స్ట్ మూవీ?
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో అనుదీప్ కె.వి. నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్రసీమలో కామెడీ చిత్రాలకు పెట్టింది పేరుగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో అనుదీప్ కె.వి ఒకరు. ఈయన పిట్టగోడ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి, జాతిరత్నాలుతో గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఈయన తెరకెక్కించిన ప్రిన్స్, ఫంకీ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి. ఈ దర్శకుడు రూపొందించిన రెండు చిత్రాలు వరుసగా ఫెయిల్యూర్ కావడంతో, ఈయన తదుపరి మూవీ సెట్ కావడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది భావించారు. అయితే ఇప్పటికే అనుదీప్ తన నెక్స్ట్ మూవీని ఓకే చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో అనుదీప్ తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం అని, అలాగే అనుదీప్ సాధారణ వినోద చిత్రాల శైలికి భిన్నంగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. ఈ దర్శకుడు ఒకే రకమైన సినిమాలు చేస్తూ వెళ్లడంతో, ఈయన సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా కొంత తగ్గినట్లు టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. నిజంగానే ఈయన సరికొత్త జానర్‌లో సినిమా చేస్తే, దానిపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






