- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fahad Fazil: పుష్ప తర్వాత ఫహాద్ తెలుగులో చిత్రాలు చేయకపోవడానికి కారణం అదే
భారీ పారితోషకం డిమాండ్ చేస్తున్న కారణంగానే పుష్ప తర్వాత ఫహద్ ఫాజిల్ తెలుగులో సినిమాలు చేయడం లేదని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మలయాళ చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు భాషల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. ఈ నటుడికి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును తెచ్చిన చిత్రాలలో పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాలు ముందు వరుసలో నిలిచాయి. పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలైన ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో పాటు, వాటిలో ఈయనకు మంచి ప్రాధాన్యత కలిగిన పాత్ర దక్కింది.
ఈ సినిమాల ద్వారా ఫహద్‌కు దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు లభించింది. అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఈయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో పుష్ప తర్వాత వరుసగా ఈ నటుడు తెలుగు చిత్రాల్లో నటిస్తారని చాలామంది భావించారు. కానీ పుష్ప ది రూల్ విడుదలై చాలాకాలం గడిచినా, ఫహద్ ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేదు. అలాగే కొత్త తెలుగు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదని సమాచారం. తెలుగులో ఇంత మంచి గుర్తింపు వచ్చినా కూడా ఈ నటుడు ఎందుకు సినిమాలు చేయడం లేదనే చర్చలు ఇండస్ట్రీలో మొదలయ్యాయి.
పుష్ప చిత్రం విడుదలైన తర్వాత ఈ నటుడి కోసం తెలుగు నుంచి అనేకమంది దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈయన ఒక్క సినిమాకు సుమారు 15 నుండి 20 కోట్ల రూపాయల వరకు పారితోషకం డిమాండ్ చేస్తున్నారని, ఆ భారీ పారితోషకం కారణంగానే నిర్మాతలు వెనుకంజ వేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతోనే పుష్ప తర్వాత ఈయన ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






