- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi : 'పెద్ది'కి మరో సమస్య.. కూల్‌గా డీల్ చేస్తున్న యూనిట్
‘టాక్సిక్’ను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఒకవేళ ఈ చిత్రం వాయిదా పడితే ఆ తేదీన ‘పెద్ది’ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. లేదంటే జూన్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: పెద్ది సినిమా విడుదల విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను మొదటగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందుకు అనుగుణంగా షూటింగ్ కూడా వేగంగా సాగింది. అయితే చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. తరువాత కొంతకాలానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేసినప్పటికీ, ఆ తేదీన కూడా సినిమా రావడం కష్టమేనని వార్తలు వెలువడ్డాయి. దీంతో స్వయంగా రామ్ చరణ్ ఒక పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయిందని, కచ్చితంగా ఏప్రిల్ 30న సినిమా విడుదల అవుతుందని స్పష్టం చేశారు.
అయినప్పటికీ ఆ తేదీకి కూడా విడుదల సాధ్యపడలేదని తర్వాత ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అదే తేదీన కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన టాక్సిక్ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఒకవేళ టాక్సిక్ సినిమా వాయిదా పడితేనే ఆ తేదీన ‘పెద్ది’ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. లేదంటే టాక్సిక్ అదే తేదీన విడుదల అయితే, ‘పెద్ది’ సినిమాను జూన్ 25కి మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ లేకుండా సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.






