- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్యతో కొరటాల సినిమా.. దేవర 2 పరిస్థితి ఏంటంటే?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలయ్య కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ ఓ అద్భుతమైన కథ చెప్పగా.. బాలయ్య దాదాపుగా ఓకే చేసినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలు పూర్తి కాగా.. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నట్లు టాక్.
ఈ క్రమంలోనే బాలయ్య బాబుతో సినిమా ఓకే అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన దేవర’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకోగా.. పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. దేవర2 గురించి జూనియర్ ఎన్టీఆర్ నుండి స్పష్టత లేకపోవడంతో కొరటాల నిరాశ చెందాడని, అలాగే ఆయన ప్రస్తుత లైనప్ కనీసం వచ్చే రెండేళ్ల వరకు నిండిపోవడంతో, సీక్వెల్ కాలపరిమితి మరింత ఆలస్యం అయ్యేలా ఉందని ఫిక్స్ అయిన ఈ డైరెక్టర్ బాలయ్యతో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. దీంతో 'దేవర 2' ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్న హర్షవర్ధన్.. ఫైనల్లీ క్లారిటీ వచ్చేసింది






