- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్న హర్షవర్ధన్.. ఫైనల్లీ క్లారిటీ వచ్చేసింది
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ వెంకటేష్ కాంబినేషన్‌లో రాబోతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’.

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ వెంకటేష్ కాంబినేషన్‌లో రాబోతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. అయితే.. ఈ ప్రాజెక్టు నుంచి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకున్నట్లు, ఆయన ప్లేస్‌లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకొన్నాడని, ఆయన స్థానంలో ఆస్థాన సంగీత దర్శకుడు తమన్ వర్క్ మొదలుపెట్టాడని మీడియాలో వస్తున్న వాటిలో నిజం లేదు. ఈ మాట స్వయంగా హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఆయన మే 1న మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పారు. అదీ సంగతి’ అంటూ ఓ సినిమా రిపోర్టర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై చెక్ పడినట్లు అయింది.






