- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3 కోట్లు దాటిన జీరో బ్యాలెన్స్ అకౌంట్లు: పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన
దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. ..

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2026 ఫిబ్రవరి 18 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించిన డేటా ప్రకారం.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా డిపాజిట్ కాని జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య 3,11,75,833 (3.11 కోట్లు)కు చేరింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎంపీ బాగ్ మిథాలి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలను వెల్లడించారు. జన్ ధన్ ఖాతాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు నిరంతరం జీరో బ్యాలెన్స్‌తో ఉన్న అకౌంట్ల సంఖ్య గత ఐదేళ్లలో ఈ కింది విధంగా పెరిగినట్లు మంత్రి వెల్లడించారు.
2021 మార్చి 31 నాటికి: 2,13,17,441 ఖాతాలు
2022 మార్చి 31 నాటికి: 2,26,59,832 ఖాతాలు
2023 మార్చి 31 నాటికి: 2,50,24,206 ఖాతాలు
2024 మార్చి 31 నాటికి: 2,60,52,913 ఖాతాలు
2025 మార్చి 31 నాటికి: 2,80,63,910 ఖాతాలు
2026 ఫిబ్రవరి 18 నాటికి: 3,11,75,833 ఖాతాలు
మహిళల ఖాతాలే ఎక్కువ!
జీరో బ్యాలెన్స్‌తో ఉన్న ఈ మొత్తం 3.11 కోట్ల జన్ ధన్ ఖాతాలలో సగానికి పైగా మహిళలవే కావడం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని డేటా ప్రకారం.. జీరో బ్యాలెన్స్ కలిగిన మహిళల జన్ ధన్ ఖాతాల సంఖ్య 1,78,57,010 (సుమారు 1.78 కోట్లు)గా ఉందని మంత్రి తెలిపారు. ఖాతాల్లో రూ.100 నుంచి రూ.1000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ల వివరాలను కేంద్ర స్థాయిలో నిర్వహించడం లేదని పంకజ్ చౌదరి స్పష్టం చేశారు.






