- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FPIs: కొనసాగుతున్న ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
దీంతో 2026లో ఇప్పటివరకు భారత ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరించుకున్న మొత్తం నిధులు రూ.2.87 లక్షల కోట్లకు చేరాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్‌పై విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి, రూపాయి విలువ క్షీణత వంటి కారణాలతో జూన్ తొలి రెండు వారాల్లోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత షేర్లలో రూ.62,853 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో 2026లో ఇప్పటివరకు భారత ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరించుకున్న మొత్తం నిధులు రూ.2.87 లక్షల కోట్లకు చేరాయి. ఇది గతేడాది మొత్తం నమోదైన రూ.1.66 లక్షల కోట్ల ఔట్‌ఫ్లోను కూడా దాటిపోయింది. ఫిబ్రవరిలో ఒక్కసారి మాత్రమే ఎఫ్‌పీఐలు నికర కొనుగోలుదారులుగా కనిపించగా, మిగతా అన్ని నెలల్లోనూ అమ్మకాలే కొనసాగాయి. ముఖ్యంగా మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.17 లక్షల కోట్ల నిధులు బయటకు వెళ్లడం మార్కెట్‌ను కలవరపెట్టింది.
అయితే ఈక్విటీల్లో అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, భారత బాండ్ మార్కెట్‌పై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతోంది. జూన్ తొలి రెండు వారాల్లోనే ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ (ఎఫ్ఏఆర్) ద్వారా ప్రభుత్వ బాండ్లలో రూ.13,200 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు డెట్ మార్కెట్‌లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు రూ.28,000 కోట్లకు చేరాయి. మరోవైపు రూపాయి ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 6 శాతం, గత ఏడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం బలహీనపడటం కూడా విదేశీ నిధులు తరలిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. అయితే గత వారం చివర్లో అమ్మకాల వేగం కొంత తగ్గడం, చమురు ధరలు దిగి రావడం, అమెరికా-ఇరాన్ చర్చలపై ఆశలు పెరగడం మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చే అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.






