- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరిలో ముగ్గురు యువకుల గల్లంతు.. ఇద్దరు సురక్షితం
గోదావరి నదిలో దిగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు యువకులు వినుకోవడంలేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఎక్కడో ఓ చోట గోదావరి వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గోదావరి నది దాటేందుకు ప్రయత్నం చేసి ముగ్గురు యువకులు ప్రాణాలపైకి తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: గోదావరి నది(Godavari River)లో దిగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు యువకులు వినుకోవడంలేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఎక్కడో ఓ చోట గోదావరి వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గోదావరి నది దాటేందుకు ప్రయత్నం చేసి ముగ్గురు యువకులు ప్రాణాలపైకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ మరొకరు గోదావరి నీటిలో కొట్టుకుపోయారు. గోదావరి నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో అంతేకాకుండా గాలి విపరీతంగా వీయడంతో నాటు తెప్ప తిరగబడింది. దీంతో ముగ్గురు యువకులు నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈత రావడంతో ఇద్దరు యువకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. రాంబాబు అనే యువకుడు మాత్రం నదిలో గల్లంతయ్యారు. ఈ యువకుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నదిలో గాలిస్తున్నాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా(Eluru District) వేలేరుపాడు మండలం రుద్రమ్మకోట(Rudrammakota) సమీపంలోని గోదావరి నదిలో జరిగింది. ఇప్పటి వరకూ రాంబాబు ఆచూకీ తెలియలేదు. పోలీసులు, రెవెన్యూ, ఎన్డీఆర్ బృందాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.






