‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ సదస్సు.. పెట్టుబడులపై ప్రధాని మోడీ కీలక చర్చలు

by Ramesh Naini |   (  Updated:2026-06-14 13:40:53  IST  )

ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ సదస్సులో పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటల్ ప్రతినిధులతో జరిగిన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.

‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ సదస్సు.. పెట్టుబడులపై ప్రధాని మోడీ కీలక చర్చలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ సదస్సులో పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటల్ ప్రతినిధులతో జరిగిన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ పెట్టుబడులకు, సరికొత్త ఆవిష్కరణలకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ఆయన ఉద్ఘాటించారు. ఈ మేరకుప్రధాని ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ.. ‘టెక్నాలజీ, తయారీ రంగాలతో పాటు ఎమర్జింగ్ సెక్టార్లలో భారత్ కల్పిస్తున్న అపారమైన అవకాశాలపై ఇన్వెస్టర్లతో చర్చించాను. అపారమైన ప్రతిభ, భారీ మార్కెట్ స్థాయి, సుస్థిరత, సంస్కరణల పునాదిగా భారత వృద్ధి పయనిస్తోంది’ అని స్పష్టం చేశారు.

భారత్ అవకాశాల ప్రదర్శన

ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోడీ పలైస్ డెస్ ఎక్స్‌పోజిషన్స్‌లో ఈ సదస్సును సంయుక్తంగా ప్రారంభించారు. భారత్‌, ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాలకు చెందిన స్టార్టప్‌లు, పారిశ్రామిక దిగ్గజాలు, పరిశోధనా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో భాగస్వామ్యాలపై చర్చించాయి. భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను, పెట్టుబడి అవకాశాలను ప్రధాని ఇన్వెస్టర్లకు ప్రముఖంగా వివరించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో వెల్లడించింది.

Next Story