చిరంజీవి-బాబి కొల్లి మూవీపై మరో బజ్.. ఈ క్రేజీ ప్రాజెక్టులో దురంధర్ బ్యూటీ

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-04 06:36:11  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.

చిరంజీవి-బాబి కొల్లి మూవీపై మరో బజ్.. ఈ క్రేజీ ప్రాజెక్టులో దురంధర్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దీనిని దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో తెరకెక్కించగా, చిరంజీవి సరసన నయనతార(Nayanathara) జంటగా నటించారు. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. నిర్మాణ పరంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి(Sahu Garapati), సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ అన్ని కలిసి సినిమాకు కమర్షియల్ టచ్ ఇచ్చాయి. అలా ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇక చిరంజీవి ప్రజెంట్ ‘విశ్వంభర’(Viswambhara) మూవీతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు వశిష్ఠ(Vasista) తెరకెక్కిస్తున్న విజువల్ ఫాంటసీ ఇప్పటికే అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తి చేసుకుంది. వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా ఆలస్యమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్రిష(Trisha) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అలాగే ఇందులో యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాతో పాటు చిరు బాబీ(Bobby Kolli) దర్శకత్వంలో తన నెక్స్ట్ చిత్రం ‘మెగా 158’ (Mega 158) కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేవీఎన్(KVN Productions) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. నారాయణ(K. Narayana) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియమణి(Priyamani) కథానాయికగా యాక్ట్ చేస్తుంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే మొన్నటి వరకు చిరంజీవికి కూతురుగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం రాగా.. ఇప్పుడు ‘దురంధర్’(Durandhar) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సారా అర్జున్(Sara Arjun) నటించబోతున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్(Ranveer Singh) హీరోగా నటించిన 'దురంధర్' సినిమా గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆదిత్య ధర్(Aditya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి విదితమే.

క్రేజీ కాంబో గురూ.. మలయాళ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా..!

మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌.. గట్టిగా ఇచ్చి పడేసిన లావణ్య త్రిపాఠి(ట్వీట్)

Next Story