Anjali: పూల చీరలో హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న అంజలి

by Pulgam srinivas |   (  Updated:2026-04-06 13:51:56  IST  )

వైట్ శారీలో వావ్ అనిపించిన అంజలి.

Anjali: పూల చీరలో హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న అంజలి
X

దిశ, వెబ్ డెస్క్: అందాల తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించినప్పటికీ, మొదట తమిళ ఇండస్ట్రీ ద్వారానే మంచి గుర్తింపును సంపాదించుకుంది.

అనంతరం టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల ఈమె నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గీతాంజలి మళ్లీ వచ్చింది, గేమ్ చేంజర్ చిత్రాలు వరుసగా ప్రేక్షకులను పలకరించాయి.

అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందించలేకపోయాయి. సినిమాల్లో తన అందాలతో ఆకట్టుకునే అంజలి, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను అందులో షేర్ చేస్తూ వస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఈమె పూల డిజైన్‌తో, మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న వైట్ కలర్ శారీని ధరించి, అందుకు తగిన బ్లౌజ్‌తో స్టైలిష్‌గా కనిపించింది.

అలాగే తన జుట్టును ముందుకు వదిలి హాట్ లుక్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ లుక్స్‌లో అంజలి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఆమెకు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

పోర్న్ సైట్‌లో జాన్వీ కపూర్ ఫొటో.. ఆమె రియాక్షన్‌కు నెటిజన్లు షాక్

Next Story