- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోర్న్ సైట్‌లో జాన్వీ కపూర్ ఫొటో.. ఆమె రియాక్షన్‌కు నెటిజన్లు షాక్
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. తన నటన, గ్లామర్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. తన నటన, గ్లామర్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా.. ‘దేవర’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇప్పుడు త్వరలో ‘పెద్ది’ చిత్రంతో అలరించేందుకు సిద్ధం అవుతున్నది. ఇదిలా ఉంటే.. డీఫ్ ఫేక్ కారణంగా 15 ఏళ్ల వయసులో చేదు అనుభవం ఎదురైందని తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో చెప్పుకొచ్చింది జాన్వీ. ‘15 ఏళ్ల వయసులో నాకు ఓ చేదు సంఘటన ఎదురైంది. ఓ అశ్లీల వెబ్‌సైట్‌లో నా డీఫ్ ఫేక్ ఫొటోను ఎవరో అప్‌లోడ్ చేశారు. అప్పుడు నేను స్కూల్‌లో చదువుకుంటున్నాను.. అయితే.. ఆ పోర్న్ సైట్‌లో నా ఫొటోను చూసి మా ఫ్రెండ్ ఒకరు నాకు చెప్పారు. ఆ టైమ్‌లో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆ విషయంపై అప్పట్లో ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాతే నాకు అర్థం అయింది.. సోషల్ మీడియాలో నైతికత లేదు అని. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎన్నో చూడాల్సి వస్తోందని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. అందుకే, నేను ఎక్కువగా డీఫ్ ఫేక్ ఫోటోలను పట్టించుకోను’ అని చెప్పుకొచ్చింది జాన్వీకపూర్.






