- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై నుంచి సెట్ పైకి.. అనిల్ రావిపూడి మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ అప్డేట్
వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి.

దిశ, సినిమా: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. దీంతో ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈయన ఇప్పుడు.. మల్టీస్టారర్ చిత్రాన్ని అనౌన్స్‌చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఒక క్లీన్, టిపికల్ అనిల్ ఎంటర్‌టైన్మెంట్‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. కీర్తీ సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ జులై నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా వార్తలు రాగా.. జీవీ ప్రకాష్ కుమార్ ఫైనల్ అయ్యారు. నవంబర్, లేదా డిసెంబర్ కల్లా టోటల్ షూట్ కంప్లీట్ చేసి 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నారు’ అని ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.






