గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ‘బాలన్ - ది బాయ్’

by Chukka Sudharani |   (  Updated:2026-05-11 15:08:37  IST  )

‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ చిదంబరం దర్శకత్వంలో రాబోతున్న మరో చిత్రం ‘బాలన్ - ది బాయ్’.

గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ‘బాలన్ - ది బాయ్’
X

దిశ, సినిమా: ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ చిదంబరం దర్శకత్వంలో రాబోతున్న మరో చిత్రం ‘బాలన్ - ది బాయ్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ స్క్రిప్ట్ అందించారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. జూన్ 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ‘బాలన్ - ది బాయ్’ సినిమా ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ నెల 14న బిజినెస్ వింగ్ అయిన మార్ష్ డు ఫిలింలో స్క్రీనింగ్ జరగనుంది. గ్లోబల్ సినిమాకు వేదికైన కేన్స్ స్క్రీనింగ్‌కు ముందే మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించడం విశేషం. మన నేటివిటీతో సాగే కథా కథనాలతో యూనివర్సల్‌గా ప్రతి ఆడియెన్ మనసును హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్నారు. థియేటర్స్‌లో తప్పక చూడాల్సిన చిత్రమిది అంటూ మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

జులై నుంచి సెట్ పైకి.. అనిల్ రావిపూడి మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ అప్డేట్

Next Story