- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anil Ravipudi : మరో భారీ మల్టీ స్టారర్ రెడీ.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలయికతో మరో మల్టీ స్టారర్ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు.

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మచ్ ఎవైటెడ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్‌తో మరోసారి అందరిలో ఆసక్తిని పెంచారు. వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నారు. F2, F3, సంక్రాంతికి వస్తున్నం వంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ల తర్వాత అనిల్, వెంకటేష్ కలయికలో వస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. అలాగే సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్‌తో రెండవ చిత్రం. దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్‌ని కలిపి ఈ కొత్త చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ అనిల్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది, ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న భారీ అంచనాలను తగ్గట్టుగా దర్శకుడు స్క్రిప్ట్‌ను జాగ్రత్తగా మెరుగుపరుస్తున్నాడు. సాంకేతిక బృందం గురించి వివరాలు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.






