- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Sirish : మెగా ఫ్యామిలీలో మోగనున్న పెళ్లి బాజాలు
మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ వివాహ తేదీ దగ్గరపడుతుండటంతో సెలబ్రేషన్స్ మొదలెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ వివాహ తేదీ దగ్గరపడుతుండటంతో సెలబ్రేషన్స్ మొదలెట్టారు. తన ప్రియురాలు నయనిక(Allu Sirish - Nayanika)తో కలిసి మార్చి 6వ తేదీన పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు అధికారికంగా ప్రకటంటించారు. మార్చి 2వ తేదీన అల్లు స్టూడియోస్‌లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు శిరీష్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. దీంతో అల్లు వారి ఇంట వేడుకలు ఆరంభం అయ్యాయి. ప్రస్తుతం హల్దీ ఫంక్షన్ వేడుకగా సాగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను అల్లు శిరీష్ వదిన, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అల్లు అరవింద్ కుటుంబం. ఈ సందర్భంగా వారు ఉంగరాలు మార్చుకున్నారు. అప్పట్లో పెళ్లి తేదీని వెల్లడించలేదు. ఈ ఏడాది పెళ్లి జరుగుతుందనే హింట్ అప్పుడే ఇచ్చారు. దీనికి అనుగుణంగానే తాజాగా మార్చి 6వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేశారు.






