Ananya Panday: ఎట్టకేలకు భరతనాట్యం వివాదంపై స్పందించిన అనన్య పాండే.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-30 06:13:25  IST  )

నేను ఇకపై ఆ విషయాలను అస్సలు పట్టించుకోను. వాటి గురించి ఆలోచించి సతమతమవ్వడం ఎప్పుడో మానేశాను.

Ananya Panday: ఎట్టకేలకు భరతనాట్యం వివాదంపై స్పందించిన అనన్య పాండే.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే, యంగ్ హీరో లక్ష్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చాంద్ మేరా దిల్’. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఈ సినిమాలోని ఒక డ్యాన్స్ సీక్వెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది. ఈ సినిమాలో అనన్యా పాండే చేసిన భరతనాట్యం డ్యాన్స్ క్లిప్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఆమె భరతనాట్య కళను అగౌరవపరిచేలా డ్యాన్స్ చేసిందంటూ నెటిజన్లు, రాజకీయ నాయకులు, కళాకారులు దారుణంగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ఆమె హావభావాలపై రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వివాదం ముదురుతుండటంతో, ఇటీవల అనన్య తండ్రి చుంకీ పాండే స్పందించి తన కూతురికి మద్దతుగా నిలిచారు.

తాజాగా ఈ వివాదంపై స్వయంగా అనన్యా పాండే స్పందించింది. తనపై వస్తున్న నెగిటివిటీపై అనన్య మాట్లాడుతూ.. "నేను ఇకపై ఆ విషయాలను అస్సలు పట్టించుకోను. వాటి గురించి ఆలోచించి సతమతమవ్వడం ఎప్పుడో మానేశాను. ఇప్పుడు నేను ఆ ట్రోలింగ్స్ నుండి పూర్తిగా బయటపడిపోయాను. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో ఏళ్లుగా నాపై ఇలాంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి. నిరంతరం మనపై వచ్చే నెగిటివిటీని వింటూ కూర్చోవడం లేదా మనల్ని విమర్శించే ఇతరులను సరిదిద్దడానికి టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే.. ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మను తాము పరిశీలించుకోవడం మంచిది. మన చుట్టూ పాజిటివిటీని సృష్టించుకోవడానికి ప్రయత్నించడమే అందరికీ శ్రేయస్కరం" అంటూ ట్రోలర్స్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. తప్పు చేసిందే కాకుండా క్షమాపణలు చెప్పకుండా.. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకుంటుందని అంటున్నారు.

Faria Abdullah: రెడ్ శారీలో బ్యాక్ గ్లామర్‌తో హీట్ పెంచుతున్న ‘జాతిరత్నాలు’ బ్యూటీ

Next Story