Faria Abdullah: రెడ్ శారీలో బ్యాక్ గ్లామర్‌తో హీట్ పెంచుతున్న ‘జాతిరత్నాలు’ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-05-30 05:13:27  IST  )

రెడ్ శారీలో బ్యాక్ గ్లామర్‌తో హీట్ పెంచిన జాతిరత్నాలు బ్యూటీ ఫారియా అబ్దుల్లా.

Faria Abdullah: రెడ్ శారీలో బ్యాక్ గ్లామర్‌తో హీట్ పెంచుతున్న ‘జాతిరత్నాలు’ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఫారియా అబ్దుల్లా పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాతిరత్నాలు చిత్రంలో ‘చిట్టి’ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అనంతరం బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్‌లో కనిపించి తన గ్లామర్‌తో యువతను ఆకర్షించింది. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించినప్పటికీ జాతిరత్నాలు స్థాయి విజయాన్ని మాత్రం మళ్లీ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ బ్యూటీ కెరీర్‌ను మంచి దశలోనే ముందుకు తీసుకెళ్తోంది.

తాజాగా ఫారియా అబ్దుల్లా, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గాయపడ్డ సింహం చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పరవాలేదనిపించే స్థాయి విజయాన్ని అందుకుంది.

సినిమాల్లో తన స్టైల్, గ్లామర్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఫారియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీతో పాటు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించింది.

పొడవాటి ఇయర్ రింగ్స్, అందంగా సెటప్ చేసిన హెయిర్ స్టైల్ ఆమె లుక్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story