- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ananya nagalla : తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన అనన్య నాగళ్ల..
నాకు కాబోయే వాడు చాలా నిజాయితీగా ఉండాలి. ప్రస్తుతం అలాంటి సరైన వ్యక్తి కోసం నేను ఎదురుచూస్తున్నాను.

దిశ, సినిమా: ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసి విపరీతమైన పాపులారిటీ రాబట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న అనన్య.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్ స్టా గ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా తన పర్సనల్ విశేషాలను పంచుకుంటూ భారీగానే సంపాదిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనన్య తన వ్యక్తిగత జీవితం, తన ఇష్టాయిష్టాల గురించి ఓపెన్‌గా మాట్లాడి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. చిన్నప్పటి నుంచి నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం.
నా క్రష్ మాత్రం టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య’’ అని చెప్పింది. ఇక తన పెళ్లి, కాబోయే భర్త గురించి మాట్లాడుతూ.. "నాకు కాబోయే వాడు చాలా నిజాయితీగా ఉండాలి. ప్రస్తుతం అలాంటి సరైన వ్యక్తి కోసం నేను ఎదురుచూస్తున్నాను. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉండటం అంటే నాకు కొంచెం భయం" అని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఎదుర్కొనే 'క్యాస్టింగ్ కౌచ్' (లైంగిక వేధింపులు) గురించి అనన్య స్పందిస్తూ.. తనకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో అలాంటి చేదు అనుభవాలు ఏమీ ఎదురుకాలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఏమున్నాడ్రా బాబూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్!






