సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అనగనగా ఒక రాజు’.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే(ట్వీట్)

by I. Sairam |   (  Updated:2026-01-10 03:54:32  IST  )

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టిస్తున్న తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju).

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అనగనగా ఒక రాజు’.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టిస్తున్న తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ కో ప్రొడ్యూస్ చేస్తుంది. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వరి 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

అయితే తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు మేకర్స్. సెన్సార్ బోర్డు అధికారులు.. అనగనగా ఒక రాజు మూవీ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ విషయాన్ని తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘అనగనగా ఒక రాజు – యూ/ఏ సర్టిఫికెట్ పొందింది, నవ్వుకు ఏజ్ లిమిట్ లేదు’ అని రాసుకొచ్చారు. ఇక షేర్ చేసిన పోస్టర్‌లో నవీన్ పోలిశెట్టి బుల్లెట్ బైక్‌ పై కూర్చుని పల్లెటూరిలో ఎవరికో చేతులు ఊపుతూ పలకరిస్తూ కనిపించారు.

సాధారణ యువకుడి లుక్‌లో, చలాకీగా నవ్వుతూ ఉన్న నవీన్.. తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. అయితే సినిమాకు 2 గంటల 20 నిమిషాల రన్ టైం కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి థియేటర్లలో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

Link

Read More..

నారీ నారీ నడుమ మురారి.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్

Next Story