- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారీ నారీ నడుమ మురారి.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

దిశ, సినిమా : చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుండగా.. డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘మంచి యూత్ ఫుల్ ఫన్ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇది. చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగా. ఇప్పుడు డైరెక్టర్‌గా ఫస్ట్ టైం సంక్రాంతికి నా సినిమా రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌తో అందరి ఆడియన్స్‌ను అలరించడం ఇష్టం. నేను తీసిన ‘వివాహ భోజనంబు’, ‘సామజవరగమన’.. ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కత్త పాయింట్ ఉంది. అందరూ కలిసి హాయిగా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని తెలిపాడు.






