‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ అవుట్.. స్టార్ హీరో వాయిస్ ఓవర్‌తో హైప్ ..

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-08 12:28:36  IST  )

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టిస్తున్న తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju).

‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ అవుట్.. స్టార్ హీరో వాయిస్ ఓవర్‌తో హైప్ ..
X

దిశ, వెబ్‌డెస్క్: మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టిస్తున్న తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ కో ప్రొడ్యూస్ చేస్తుంది.

మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వరి 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్‌లో ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే గోదావరి జిల్లాల్లోని ఒక ఊళ్ళో పెళ్లి కోసం చూసే జమిందార్ కుర్రాడి కథలా అనిపిస్తుంది. నాగార్జున వాయిస్ ఓవర్‌తో, కామెడీతో, గోదావరి జిల్లాల ఎంటర్టైన్మెంట్‌తో పండగ సినిమాలా అనగనగా ఒక రాజు ఉండబోతుందని తెలుస్తుంది.

READ MORE ....

Next Story