- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కపుల్ ఫ్రెండ్లీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. నాలో నేను అంటూ ఆకట్టుకుంటున్న హీరో హీరోయిన్ కెమెస్ట్రీ
యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh Sobhan) నటిస్తున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly).

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh Sobhan) నటిస్తున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). చెన్నై నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో హీరోయిన్‌గా మానస వారణాసి (Manasa Varanasi) నటిస్తోంది. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ భారీగా నిర్మిస్తోంది.
అయితే ఆదిత్య రవీంద్రన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీను లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ నిన్న వెల్లడించారు. దీంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నాలో నేను ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. ఆదిత్య రవీంద్రన్ స్వర పరచిన ఈ రొమాంటిక్ మెలోడీ యూత్‌ను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా హీరో హీరోయిన్ కెమెస్ట్రీ కూడా చూడ ముచ్చటగా అనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫస్ట్ సింగిల్‌ను వినేయండి.
READ MORE ....






