ముంబై నటి జత్వానీ కేసులో వెలుగులోకి సంచలనాలు

by Ajay Maddhiboyina |

ముంబై న‌టి జ‌త్వానీ కేసులో విజ‌య‌వాడ సీఐడీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖ‌లైంది. సీఐడీ ఛార్జ్ షీట్‌లో కీలక అంశాలు పేర్కొన్నారు. వైసీపీ నేత విద్యాసాగర్‌ను జత్వానీ బెదిరించినట్టు సీఐడీ ప్రస్తావించింది.

ముంబై నటి జత్వానీ కేసులో వెలుగులోకి సంచలనాలు
X

దిశ, వెబ్ డెస్క్: ముంబై న‌టి జ‌త్వానీ కేసులో విజ‌య‌వాడ సీఐడీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖ‌లైంది. సీఐడీ ఛార్జ్ షీట్‌లో కీలక అంశాలు పేర్కొన్నారు. వైసీపీ నేత విద్యాసాగర్‌ను జత్వానీ బెదిరించినట్టు సీఐడీ ప్రస్తావించింది. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలతో తనను జత్వానీ బెదిరించిందని విద్యాసాగర్ సీఐడీకి తెలిపారు. తన పరువు కాపాడుకునేందుకు తరచూ డబ్బులు ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్ జత్వానీకి మొత్తం రూ.1.32 కోట్లు చెల్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. జత్వానీ, ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకు విద్యాసాగర్ నగదు బదిలీ చేసినట్టు ఛార్జ్ షీట్‌లో సీఐడీ పేర్కొంది.

ఇదిలా ఉంటే గతంలో విద్యాసాగర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తన కుటుంబంపై కేసులు పెట్టి వేధించాడని నటి జత్వానీ సంచలన ఆరోపణలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాసాగర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో విద్యాసాగర్ దాదాపు 76 రోజులకు పైగా జైలులో ఉడి తరవాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక సీఐడీ ఎంట్రీతో కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో జత్వాని వ్యక్తిగత ఫోటోలతో విద్యాసాగర్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజినట్టు తేలింది. దీంతో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Next Story