- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాకా’ని తొందరగా తీసుకురావడం కోసం ఏకంగా అలాంటి పనికి సిద్ధమైన అల్లు అర్జున్
'రాక' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో, ఎలాంటి సమయ వృథా జరగకూడదన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాక’ ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలను రేపుతోంది. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, అది ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో ఉన్న ఈ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదిలా ఉండగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆయన పాత్రకు ప్రత్యేకమైన మేకప్ అవసరం ఉండగా, దానిని వేసేందుకు దాదాపు నాలుగు గంటలు, తీసివేయడానికి మరో రెండు గంటలు సమయం పడుతోందట. అంటే మొత్తం మేకప్ ప్రక్రియకే ఆరు గంటల సమయం వెచ్చించాల్సి వస్తోంది.
దీంతో పాటు షూటింగ్ లొకేషన్‌కు రోజూ ప్రయాణంలో కూడా ఎక్కువ సమయం వృథా అవుతున్న నేపథ్యంలో, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఆయన అక్కడే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






