- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నగరానికి ఏమైంది 2 : సూపర్ అప్డేట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ… ఈ ‘ఈ నగరానికి ఏమైంది 2’ చిత్రంలో సుశాంత్ చేసిన పాత్రకు బదులుగా శ్రీనాథ్ మాగంటిని తీసుకున్నట్లు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తరుణ్ భాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నగరానికి ఏమైంది 2 చిత్రానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రారంభం ఆలస్యమైన కారణాలపై ఆయన స్పందించారు. ఇంటర్వ్యూలో భాగంగా, “ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇంత లేటుగా ఎందుకు ఈ సినిమాను ప్రారంభించారు?” అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి తరుణ్ భాస్కర్ సమాధానంగా మాట్లాడుతూ… “ఇది గవర్నమెంట్ స్కీమ్ కాదు కదా, ఎప్పుడంటే అప్పుడు ప్రారంభించడానికి. అవును, చాలా మంది ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే నాకు ఈ కథకు సంబంధించిన ఐడియా కొంతకాలం క్రితమే వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాను ప్రారంభించాం. సరైన సమయంలోనే ఈ ప్రాజెక్ట్ మొదలైందని నేను భావిస్తున్నాను” అని తెలిపారు. అలాగే, మొదటి భాగంలో నటించిన నటీనటులు ఈ సీక్వెల్‌లో కొనసాగుతున్నారా అనే ప్రశ్నకు కూడా ఆయన స్పందించారు. “దాదాపు అందరూ ఈ సినిమాలో కనిపించనున్నారు. అయితే కార్తీక్ పాత్రలో నటించిన సుశాంత్ కి వైజాగ్‌లో కొన్ని కమిట్‌మెంట్స్ ఉండటంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొనలేకపోతున్నారు. దాంతో ఆ పాత్రలో శ్రీనాథ్ మాగంటిను రీప్లేస్ చేసినట్లు” తరుణ్ భాస్కర్ వెల్లడించారు.






