- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CJP నిరసనపై పిల్.. ఇప్పుడే విచారణ కుదరదన్న కోర్ట్
ఢిల్లీలో రేపు జరగబోయే కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసన ప్రదర్శనలపై ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో రేపు జరగబోయే కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసన ప్రదర్శనలపై ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. నీట్ పరీక్ష లీకేజి, జేఈఈ (JEE) డేటా లీకేజీ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP భారీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసన కార్యక్రమంపై ఆంక్షలు విధిస్తు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిల్ ను అత్యవసరంగా విచారించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ నిరసన ప్రదర్శనల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులతో పాటు నగరంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని, అలాగే శాంతిభద్రతల (Law and Order) సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఒక పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. నిరసనకారులను నియంత్రించడానికి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా 'క్రౌడ్ కంట్రోల్' (Crowd Control) చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు.
ఈ పిటిషన్‌పై జూన్ 5న విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. దీనిని 'అర్జెంట్ హియరింగ్' (Urgent Hearing) కింద స్వీకరించి ఇప్పుడే విచారించాల్సిన అంత అత్యవసర పరిస్థితి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ నిరసనలకు సంబంధించి తక్షణ జోక్యం అవసరం లేదని అభిప్రాయపడుతూ, ఈ పిల్‌ను కోర్టు సాధారణ విచారణల జాబితాకు బదిలీ చేసింది. జేఈఈ డేటా ఎక్స్‌పోజర్ అంశం ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, CJP రేపు చేపట్టబోయే ఈ నిరసన కార్యక్రమానికి హైకోర్టు నుండి ఎలాంటి తక్షణ అడ్డంకులు గాని ప్రత్యేక మార్గదర్శకాలు రాకపోవడంతో నిరసన కార్యక్రమానికి CJP పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.






