- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీకి అస్వస్థత.. మృతి
యూ.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన పాలికి అప్పారావు ఉపాధి హామీ పనులకు వెళ్లి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ..

X
దిశ, యూ.కొత్తపల్లి: యూ.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన పాలికి అప్పారావు ఉపాధి హామీ పనులకు వెళ్లి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పారావు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం. అప్పారావు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






