నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అజారుద్దీన్

by Taduka Kalyani |

ఈ నెల 8వ తేదీన ప్రారంభం కానున్న సాంప్రదాయ చేప మందు (ప్రసాదం) పంపిణీ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ శుక్రవారం పరిశీలించారు

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అజారుద్దీన్
X

దిశ, కార్వాన్ : ఈ నెల 8వ తేదీన ప్రారంభం కానున్న సాంప్రదాయ చేప మందు (ప్రసాదం) పంపిణీ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ శుక్రవారం పరిశీలించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ పనులను తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ప్రతి ఏటా బత్తిని సోదరులు భక్తులకు అందించే ఈ చేప ప్రసాదం పంపిణీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి అజారుద్దీన్ అధికారులతో కలిసి గ్రౌండ్‌లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌కు తరలివస్తారని,ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు.

Next Story