హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

by Naga Rani Yarlagadda |

అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట చెరువు భూముల ఆక్రమణ, హైడ్రా పరిరక్షణ నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ పై కేంద్ర హోంశాఖకు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు
X
  • చర్యలు తీసుకోవాలని సీఎస్ కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట చెరువు భూముల ఆక్రమణ, హైడ్రా పరిరక్షణ నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ పై కేంద్ర హోంశాఖకు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ లేఖ రాశారు. అయితే ఈ లేఖ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ‘బతుకమ్మకుంట ఆక్రమణదారుల కుట్రలు మరోసారి బయటపడ్డాయి. చెరువు పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS) అధికారిని లక్ష్యంగా చేసుకుని, వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆక్రమణదారులు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు వచ్చే ప్రజా ఫిర్యాదులను (Public Complaints) తదుపరి పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత చర్య నిమిత్తం పంపడం ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియ. అధికారిపై విచారణకు ఆదేశించినట్లు కాదు’ అని రంగనాథ్ పేర్కొన్నారు.

Next Story