- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ కథనానికి స్పందన.. గ్రామ పంచాయతీకి పన్ను చెల్లించిన పరిశ్రమ
గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా కొన్ని పరిశ్రమలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ "పర్మిషన్ లేదు.. ట్యాక్స్ కట్టారు" శీర్షికతో దిశ దినపత్రికలో మే 26న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

దిశ, తూప్రాన్ : గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా కొన్ని పరిశ్రమలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ "పర్మిషన్ లేదు.. ట్యాక్స్ కట్టారు" శీర్షికతో దిశ దినపత్రికలో మే 26న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామస్థుల వినతి మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి రూపా గౌడ్ కేఎంసీ పరిశ్రమను సందర్శించి స్థల కొలతలు నిర్వహించారు. అనంతరం సంబంధిత పరిశ్రమకు డిమాండ్ నోటీసు జారీ చేయగా, ఆ పరిశ్రమ గ్రామ పంచాయతీకి బకాయి పన్నులను చెల్లించినట్లు సమాచారం.అయితే ఇదే తరహాలో మండల వ్యాప్తంగా మరికొన్ని పరిశ్రమలు గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పన్నులు చెల్లించని పరిశ్రమలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు రావాల్సిన ఆదాయాన్ని రక్షించేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.






