వాళ్లను స్వయంగ కలిసి ఈ కథ రాశా.. వంద దేవుళ్ళు చిత్రంపై డైరెక్టర్ కామెంట్స్

by Chukka Sudharani |

‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కలయికలో వస్తున్న మూవీ ‘నూరు సామి’.

వాళ్లను స్వయంగ కలిసి ఈ కథ రాశా.. వంద దేవుళ్ళు చిత్రంపై డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కలయికలో వస్తున్న మూవీ ‘నూరు సామి’. తెలుగులో ఈ చిత్రం ‘వంద దేవుళ్ళు’ పేరుతో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నాడు డైరెక్టర్ వశి. ‘నూరుసామి కథ ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. నేను మొదట వారిని ఒక రియాలిటీ షోలో చూశాను. ఆ షో చూస్తున్నప్పుడు నాకు ఎంతో బాధ, భావోద్వేగం కలిగాయి. ఆ తర్వాత, నేను వారిని స్వయంగా కలిసి, వారి గ్రామాన్ని సందర్శించి, అక్కడి చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. వారిని నిజ జీవితంలో కలవడం, వారి అనుభవాల గురించి తెలుసుకోవడం ఈ కథను రాయడానికి నాకు ఎంతగానో సహాయపడింది’ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో స్వాసిక అజయ్, కావ్య, శక్తి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రామాంజనేయులు జవ్వాని నిర్మిస్తున్నారు.

Next Story