చామల వెంకటరమణారెడ్డి కృషికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు..

by Kodari Anjali |

రైతు సంఘం ప్రతినిధి చామల వెంకటరమణ రెడ్డి పలుమార్లు తానే స్వయంగా రైతులతో నీరు సక్రమంగా వచ్చేందుకు తాత్కాలిక చర్యలకు దిగారు.

చామల వెంకటరమణారెడ్డి కృషికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు..
X

దిశ, శాలిగౌరారం: నల్గొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులలో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చే "తుర్కపల్లి ప్రీడర్" ఛానల్ వద్ద షట్టర్లు లేకపోవడంతో ఎస్కేప్ వాటర్ మీరు మూసీలోకి వృథాగా పోతున్న విషయాన్ని గ్రహించిన రైతు సంఘం ప్రతినిధి చామల వెంకటరమణ రెడ్డి పలుమార్లు తానే స్వయంగా రైతులతో నీరు సక్రమంగా వచ్చేందుకు తాత్కాలిక చర్యలకు దిగారు. ఈ విషయం పట్ల ఇరిగేషన్ ఉన్నతాధికారులను పలుమార్లు కలిశారు. శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం కోసం చామల వెంకటరమణ రెడ్డి చేస్తున్న కృషి పట్ల స్పందించిన ఇరిగేషన్ ఉన్నతాధికారులు శుక్రవారం శాలిగౌరారం ప్రాజెక్టును సందర్శించారు. ఆయా సమస్యల పట్ల అధికారులు స్పందిస్తూ.. పల్లివాడ ఆనకట్టను, పల్లివాడ రాచకాలువ నుండి శాలిగౌరారం ప్రాజెక్టుకు నీరు వచ్చే షట్టర్లను రిపేర్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఈ నాగభూషణం, ఎస్ ఈ శివధరమ్ తేజ్, ఈ ఈ సత్యనారాయణ, ఏఈ ఈ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story