విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కళ్లముందే కాలిపోయిన జామాయిల్ తోట..

by Kodari Anjali |   (  Updated:2026-06-05 14:14:52  IST  )

బొక్కలతండ స్టేజీ వద్ద రైతు వాకుండోత్ గన్యకు చెందిన ఎకరంన్నర జామాయిల్ తోట శుక్రవారం అగ్నికి ఆహుతైంది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కళ్లముందే కాలిపోయిన జామాయిల్ తోట..
X

దిశ, కారేపల్లి: మండలంలోని బొక్కలతండ స్టేజీ వద్ద రైతు వాకుండోత్ గన్యకు చెందిన ఎకరంన్నర జామాయిల్ తోట శుక్రవారం అగ్నికి ఆహుతైంది. గాలికి విద్యుత్ వైర్లు చెట్లకు తగలడంతో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పంచాయతీ సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ తోట పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

Next Story