ఢిల్లీ మూటల కోసమే.. భూముల ధరల పెంపు

by Taduka Kalyani |

ఢిల్లీకి డబ్బుల మూటలు పంపడం కోసమే కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని భూముల ధరలను పెంచడం జరిగిందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు.

ఢిల్లీ మూటల కోసమే.. భూముల ధరల పెంపు
X

దిశ, గజ్వేల్ : ఢిల్లీకి డబ్బుల మూటలు పంపడం కోసమే కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని భూముల ధరలను పెంచడం జరిగిందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనాలోచితమైన విధానాల వలన ముందుచూపు లేని ప్రణాళికల వలన తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన చూసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం దివాలా తీసిందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వ్యాపారస్తులు తమ భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు అమ్ముడుపోక రియల్ వ్యాపారులు రేవంత్ రెడ్డి పాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారం దివాలా అయిందని అన్నారు. ఇలాంటి సమయంలో మూలుగుతున్న రియాల్టీపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరలను పెంచడం చాలా దుర్మార్గమని, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు, చతికిలబడిన రియల్ ఎస్టేట్ రంగంపై ధరల పిడుగు పడటం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు సామాన్య ప్రజల వ్యాపారస్తుల రక్తం తాగే విధంగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఢిల్లీకి పంపించే మూటలని అన్నారు. సంపద సృష్టించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతకాక రియాల్టీ ధర మూత వలన ప్రజల జీవితాలను గుల్ల చేసి సర్కార్ రేవంత్ రెడ్డి ఖజానాను నింపుకుంటుందని మండిపడ్డారు. భూముల ధరలను 100% నుంచి 300% పెంచడం చాలా దుర్మార్గమని అన్నారు. గ్రామాల్లో రూ.మూడు లక్షలు, మున్సిపాలిటీలో రూ.5 లక్షలు, హెచ్ఎండి పరిధిలో రూ.10 లక్షలు, ఓ ఆర్ ఆర్ పరిధిలో రూ.15 లక్షలు పెంచడం చాలా దారుణమని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సంపాదన సృష్టిస్తే, ప్రస్తుత అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తాగుతుందని తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో దివాలా తీసిన రియల్ ఎస్టేట్ రంగం

ఇరాన్ అమెరికా యుద్ధమే సాకుగా తీసుకొని కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలోని అసమర్థ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలను మొదలుకొని పెట్రోల్ డీజిల్ తో పాటు అన్ని రకాల వ్యాపార సముదాయాల ధరలతో పాటు భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని ఆరోపించారు. గత బీఆర్ఎస్ కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన విప్లమాత్మక చారిత్రాత్మక నిర్ణయాలు కార్యక్రమాలు పథకాలు ఆర్థిక రంగంలో వ్యాపార రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ కృషి వల్ల జీఎస్ డీపీ పైపైకి పోయిందని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాలు ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపాయని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన తెలంగాణ జీఎస్ డీపీ రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో నేల చూపులు చూస్తుందని దివాలా తీసిందని అన్నారు. ధరలను పెంచి, సామాన్యుడి నడ్డి విరిచి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా అంచుల్లోకి నెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, 420 హామీలు తుంగలోకి పోయాయని అన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వక్రబుద్ధిని మానుకొని, ఢిల్లీకి మూటలు పంపడం మానుకొని, పాలనపై దృష్టి పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గంగిశెట్టి చందనా రవీందర్, వైస్ చైర్ పర్సన్ పద్మాబాయి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు నమాజ్ మీరా, కౌన్సిలర్లు, అత్తిలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, బొగ్గుల స్వప్న సురేష్, మన్నేరూప వెంకటేష్, కప్ప మమతా పోచయ్య, కోట బాబు, మరికంటి కనకసేన, మాజీ కౌన్సిలర్లు గుంటుకు రాజు, మరికంటి కనకయ్య, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి, నాయకులు అహ్మద్, శివకుమార్, తదితరులు ఉన్నారు.

Next Story