- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య భర్తల మధ్య కలహాలు... మనస్థాపంతో భర్త బలవన్మరణం
భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోగా... మనస్థాపం చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.

దిశ, జవహర్ నగర్ : భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోగా... మనస్థాపం చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... కాప్రా మండల పరిధి ఎల్లారెడ్డిగూడ సీఎస్ నగర్లో మిడిపేట ప్రకాష్, భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో గత రెండు సంవత్సరాలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 4న భార్యభర్తలు గొడవ పడగా కుటుంబసభ్యులైన బస్వారాజ్, గౌరిలకు జరిగిన విషయాన్ని ప్రకాష్ తెలియజేశారు. ఈ క్రమంలో మనస్థాపం చెందిన ప్రకాష్(44) కుక్కను కట్టేసే బెల్టుతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు స్థానికులకు ఫోన్ చేసి ప్రకాష్ ను చూడమని అడగ్గా... ఉరి వేసుకుని కనిపించాడని తెలిపారు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించగా మరణించాడని వైద్యులు తెలిపారు. భార్యాభర్తల కలహాలు, వేరే ఇతర కారణాలతో మరణించి ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






