ఖైరతాబాద్‌లో ఘోర లిఫ్ట్ ప్రమాదం...

by Taduka Kalyani |

ఖైరతాబాద్‌లోని భావన అపార్ట్‌మెంట్‌లో ఘోర లిఫ్ట్ ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో 58 ఏళ్ల మహిళ రాధ తీవ్రంగా గాయపడగా, ఆమెతో పాటు ఉన్న 13 నెలల మనవడు కూడా గాయాలపాలయ్యాడు.

ఖైరతాబాద్‌లో ఘోర లిఫ్ట్ ప్రమాదం...
X

దిశ, ఖైరతాబాద్ : ఖైరతాబాద్‌లోని భావన అపార్ట్‌మెంట్‌లో ఘోర లిఫ్ట్ ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో 58 ఏళ్ల మహిళ రాధ తీవ్రంగా గాయపడగా, ఆమెతో పాటు ఉన్న 13 నెలల మనవడు కూడా గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తులో లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న రాధకు లిఫ్ట్ రాకముందే డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. లిఫ్ట్ క్యాబిన్ అక్కడే ఉందని భావించిన ఆమె లోపలికి అడుగు వేయగా, నేరుగా లిఫ్ట్ షాఫ్ట్‌లోకి పడిపోయింది. దీంతో ఆమె మొదటి అంతస్తు వరకు కిందపడినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఆమెతో ఉన్న 13 నెలల మనవడికి కూడా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి ఇద్దరినీ సమీప ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ప్రస్తుతం జెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన సాంకేతిక లోపాలపై నిపుణులతో కలిసి విచారణ చేస్తున్నారు. లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? భద్రతా ప్రమాణాలు పాటించలేదా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story