ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం, సొంత భవనాలు నిర్మించాలి..

by Kodari Anjali |

ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం, సొంత భవనాల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు వినతిపత్రం అందజేశారు.

ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం, సొంత భవనాలు నిర్మించాలి..
X

దిశ, చివ్వేంల: చివ్వేంల మండలం ఐలపురం ఎస్టీ గురుకుల బాలికల పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, సూర్యాపేట జిల్లాలో గురుకుల హాస్టల్స్‌కు స్వంత బిల్డింగ్‌లు కేటాయించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్, గిరిజన ఉపసర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోత్ సురేష్ నాయక్ వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చివ్వేంల మండలం ఐలపురం ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రహరీ గోడ లేకపోవడం వల్ల రాత్రి సమయంలో బాలికలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక అధికారులను ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. ఎస్టీ గురుకుల హాస్టల్ గ్రామానికి దూరంలో ఉండడం వల్ల గిరిజన బాలికలు రాత్రి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో అన్ని ప్రభుత్వ హాస్టల్‌లను ప్రభుత్వ భూమి కేటాయించి స్వంత బిల్డింగ్ నిర్మించాలని కోరుకుంటున్నామన్నారు. సూర్యాపేట జిల్లాలో చివ్వేంల మండలంలో అధికంగా తండాల ప్రాంతం, ఈ మండలానికి రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత ఇచ్చి, అధిక ఇందిరమ్మ ఇల్లును మంజూరు విజ్ఞప్తి చేశారు.

Next Story