- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మండు వేసవి నుంచి రిలీఫ్.. తెలంగాణలో వర్షాలపై లేటెస్ట్ అప్డేట్
రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

- ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
- గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో అత్యధిక వర్షపాతం : వాతావరణ శాఖ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు తగ్గనుండటంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హన్మకొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ గాలివేగం 40నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ 10 సెం.మీ, బిక్నూర్ లో 9 సెం.మీ, దోమకొండ 8 సెం.మీ, జనగాం జిల్లా ఘన్ పూర్ లో 7 సెం.మీ, కామారెడ్డిలో 6 సెం.మీ, పెద్దపల్లిలో 6 సెం.మీ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో 5 సెం.మీ, కరీంనగర్ లో 4 సెం.మీ, హుజురాబాద్ లో 4 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్ పూర్ లో 3 సెం.మీ, రంగారెడ్డి జిల్లా యాచారంలో 3 సెం.మీ, ములుగులో 3 సెం.మీ, మెదక్ జిల్లా అల్లాదుర్గ్ లో 3 సెం.మీ,చొప్పున వర్షాపాతం నమోదైంది






