- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్మికుల హక్కులకై నిరంతరం పోరాడిన యోధుడు స్వర్గీయ జి. ఎల్లన్న
కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడు స్వర్గీయ జి. ఎల్లన్న అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

దిశ, రామచంద్రాపురం : కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడు స్వర్గీయ జి. ఎల్లన్న అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్‌లోని జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్‌లో కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ జి. ఎల్లన్న 85వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ తో కలిసి ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఎల్లన్న కేవలం కార్మిక నాయకుడే కాకుండా తెలంగాణ ఉద్యమానికి అంకితభావంతో పనిచేసిన గొప్ప యోధుడని కొనియాడారు. సాధారణ కార్మికుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం బీహెచ్‌ఈఎల్ ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా, జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిందని గుర్తు చేశారు. కార్మికుల హక్కులు, స్థానిక యువత ఉద్యోగాల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎల్లన్న చురుకుగా పాల్గొని తెలంగాణ సాధన కోసం కృషి చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. తన కుటుంబం కంటే కార్మికులు, తెలంగాణ ప్రజల సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన నిస్వార్థ నాయకుడు ఎల్లన్న అని చెప్పారు. ఎల్లన్న సేవలకు గుర్తుగా ఆయన వర్ధంతి నాటికి 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని హరీశ్ రావు కోరారు. భౌతికంగా ఎల్లన్న మన మధ్య లేకపోయినా, ఆయన సేవలు మరియు పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన చివరి శ్వాస వరకు కార్మికుల సంక్షేమం, హక్కులతో పాటు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత నాయకుడు.. అజాత శత్రువు ఎల్లన్న అని కోనియాదారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ,ఎల్లన్న కుమారుడు విజయ ప్రతాప్, బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, పాండురంగారెడ్డి, విజయ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.






