- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడుగురు నాన్ కేడర్ ఎస్పీలకు పోస్టింగ్
స్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఏడుగురు నాన్ కేడర్ ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, ఏపీ బ్యూరో: పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఏడుగురు నాన్ కేడర్ ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఓ.దిలీప్‌ను ఇంటిలిజెన్స్, టీటీ ప్రభాకర బాబుకు సీఐడీ(మహిళా ప్రొటెక్షన్ సెల్), డాక్టర్ వీబీ రాజ్ కమల్‌కు ఇంటిలిజెన్స్, కే.శ్రావణికి మెరైన్, డీ.శ్రీ భవానీ హర్షకు సీవీఓ, పీర్ అండ్ ఆర్డీ విభాగం, కే.శ్రీలక్ష్మికి సీఐడీ(యుఆర్‌సీసీ), జే.రమేష్ రెడ్డికి సీఐడీ(సైబర్ క్రైమ్) ఎస్పీలుగా పోస్టింగ్ ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
15 మంది అదనపు ఎస్పీలకు పోస్టింగ్..
రాష్ర్టంలోని 15 మంది అదనపు ఎస్పీ(సివిల్)లకు పోస్టింగ్ ఇచ్చారు. కే.సుధాకర్‌ను ఇంటిలిజెన్స్, ఏ.పద్మలతను సీఐడీ, బీ.సీతారామయ్యను సీఐడీ, వై.శ్రీపాదరావును ఇంటిలిజెన్స్, కే.శ్రవంతి రాయ్‌ను ఏసీబీ, డాక్టర్ బీ.రవి కిరణ్‌ను సిఐడీ, టీడీ యశ్వంత్‌ను ఇంటిలిజెన్స్, కే.లతాకుమారిని ఎన్‌టీఆర్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్‌కు, బీ.శ్రీనినాథ్ ఇంటిలిజెన్స్, ఎస్ఆర్‌సీ హర్షితను ఏసీబీ, ఎస్.భవ్య కిషోర్‌ను ఏసీబీ, వై.జెస్సీ ప్రశాంతిని ఈగల్, ఎస్.శిరీష్‌ను సీఐడీ, యు.శ్రీనివాసరావు, జే.వెంకటరావుకు ఇంటిలిజెన్స్‌లో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐదుగురు ఎఆర్ అదనపు ఎస్సీలకు పోస్టింగ్..
పీ.కిరణ్ కుమార్‌కు విజయనగరం, పీవీ అప్పారావుకు నెల్లూరు, బీ.చిన్ని కృష్ణకు నంద్యాల, ఎన్.వెంకట రమణకు ఎన్‌టీఆర్ కమిషనరేట్ సీఎఆర్ అదనపు డీసీపీగా, జీ.నాగేశ్వరరావుకు ప్రకాశం ఏఆర్ అదనపు ఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చారు.






