బిల్డర్ నిర్లక్ష్యానికి బలైన శ్రీరామనగర్..!

by Kodari Anjali |

ఏదులాపురం మున్సిపాలిటీ 29వ వార్డు శ్రీరామనగర్‌లో పరిస్థితి దారుణంగా మారింది.

బిల్డర్ నిర్లక్ష్యానికి బలైన శ్రీరామనగర్..!
X

దిశ, ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ 29వ వార్డు శ్రీరామనగర్‌లో పరిస్థితి దారుణంగా మారింది. ఓ బిల్డర్ కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వర్షపు నీరు వెళ్లే మార్గం మూసుకుపోయింది. ఫలితంగా శుక్రవారం సాయంత్రం కురిసిన స్వల్ప వర్షానికే రహదారి చెరువును తలపించేలా నీటితో నిండిపోయింది. నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు కష్టంగా మారడంతో పాటు దోమలు, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. "బిల్డర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని కాలువను వెంటనే పునరుద్ధరించాలి. లేదంటే ఆందోళనకు దిగుతాం" అని స్థానికులు హెచ్చరిస్తున్నారు. సుమారు 150 అడుగుల మేర సైడ్ కాలువ ఆక్రమించడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని కలాని వాసులు ఆరోపిస్తున్నారు.

Next Story