- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఆమనగల్లు: యువకులు సులభంగా డబ్బు సంపాదన లక్ష్యంతో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు కడ్తాల్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. శుక్రవారం తలకొండపల్లి ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో హోండా యాక్టివా స్కూటీపై అనుమానస్పదంగా వెళుతున్న ఇద్దరు యువకులను, వాహన పత్రాలు అడగగా ఇవ్వలేకపోయారని, అనుమానంతో విచారణ చేయగా స్కూటీని దొంగతనం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీంకు అభినందనలు..
ఆమనగల్లు మండలము చంద్రాయన పల్లి తండా జటవత్ చరణ్ (19), తలకొండపల్లి మండలం బోడియా తండా విస్లావత్ అనిల్, మరో నిందితుడు కిల్లంపల్లి రాజశేఖర్(21) ద్విచక్ర వాహనాలను సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంతో కడ్తాలు, చౌటుప్పల్, ఆదిభట్ల, చిట్యాల, దమ్మపేట తదితర ప్రాంతాలలో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి నెంబర్ ప్లేట్లను మార్చి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 8 వాహన చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. ద్విచక్ర వాహనాల కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం కానిస్టేబుల్ రామకోటి, రఘునాయక్ లను పోలీసులు అభినందించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సి పి తరుణ్ జోషి సిబ్బంది పనితీరును అభినందిస్తూ, ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేస్తామని తెలిపినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వరప్రసాద్ సిబ్బంది తదితరులు ఉన్నారు.






