పోషకాహార నాణ్యతపై మంత్రి సీతక్క ‘స్పెషల్ ఫోకస్’.. 7న ప్రత్యేక శిక్షణ

by Vemula.Srinu Prasad |

అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పోషకాహారాన్ని మరింత నాణ్యంగా, సురక్షితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ...

పోషకాహార నాణ్యతపై మంత్రి సీతక్క ‘స్పెషల్ ఫోకస్’.. 7న ప్రత్యేక శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పోషకాహారాన్ని మరింత నాణ్యంగా, సురక్షితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అంగన్వాడీ సేవల బలోపేతం, ఆహార భద్రత ప్రమాణాల కచ్చితమైన అమలుపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దృష్టి సారిస్తున్నారు. ఆహార భద్రతపై అంగన్వాడీ సిబ్బందికి మరింత అవగాహన కల్పించేందుకు ఈ ఆదివారం (జూన్ 7)న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార పదార్థాల సేకరణ, నిల్వ, వంట ప్రక్రియ, పరిశుభ్రత ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ, లబ్ధిదారులకు సురక్షితమైన పోషకాహారం అందించే విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ఫుడ్ సేఫ్టీ అధికారులను మాస్టర్ ట్రైనర్లుగా నియమించారు. వారు అంగన్వాడీ సిబ్బందికి ఆహార భద్రత, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యక్ష శిక్షణ అందించనున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం శిక్షణ ఇస్తారు. ఆహార భద్రత ప్రమాణాలను మరింత పటిష్ఠం చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story