- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైక్రో డిటాచ్‌మెంట్.. జెన్ Zలో మరో నయా ట్రెండ్!
సోషల్ మీడియాను, వర్క్‌ను పూర్తిగా వదిలేయకుండా, చిన్న చిన్న విరామాలతో ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యువత మైక్రో డిటాచ్‌మెంట్ ట్రెండ్‌ను ఫాలో అవుతోంది.

దిశ, ఫీచర్స్ : ఉరుకులు పరుగుల జీవితం.. ఒత్తిడితో కూడిన జీవనశైలి నుంచి రిలీఫ్ కోసం యువత ఇప్పుడు మరో కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. అదే మైక్రో-డిటాచ్‌మెంట్ ట్రెండ్. మానసిక ఆరోగ్య సంరక్షణ ట్రెండ్‌గా జెన్ Zలో ఇది ఫుల్ పాపులర్ అవుతోంది. ఇటు సోషల్ మీడియాను, అటు చేస్తున్న ఉద్యోగం, ఇతర పనులు వంటివి పూర్తిగా వదిలేయకుండానే చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఒత్తిడి, ఆందోళన, అతి ఆలోచనలను దూరం చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం.
మైక్రో-డిటాచ్‌మెంట్‌లో భాగంగా వర్క్‌లో బ్రేక్స్, కాసేపు ఒంటరిగా గడపడానికి యువత ఇష్టపడుతోంది. విరామ సమయాన్ని తమకు ఇష్టమైన విషయాలపైన కేంద్రీకరిస్తోంది. నడక, మ్యూజిక్ వినడం, బుక్ చదవడం, జరనల్ రాయడం, ప్రకృతిలో గడపడం, స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం వంటి పనుల ద్వారా రోజువారీ జీవితంలో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్‌థింకింగ్‌లను దూరం చేసుకుంటోంది. జీవితంలో ప్రశాంతత, సమతుల్యతకోసం ఇది ఎంతో ఉపయోగపడుతోందని చెబుతున్నారు.






