- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు గుడ్‌న్యూస్! కోట్ల విలువైన భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలల్లో లక్ష ఇండ్లను నిర్మించి.. ఆ స్థలాల్లో వారి వాటాకు యజమానిని చేస్తూ పేదింటి ఆడబిడ్డలకు ఇవ్వబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలల్లో లక్ష ఇండ్లను నిర్మించి.. ఆ స్థలాల్లో వారి వాటాకు యజమానిని చేస్తూ పేదింటి ఆడబిడ్డలకు ఇవ్వబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పేదల జీవనోపాధికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు లక్ష ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై శుక్రవారం సెక్రెటేరియట్‌లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లకు ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షలు మొత్తం 3.50 లక్షల ఇండ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులను, వారి ఉపాధి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్ నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందని విమర్శించారు. ఫలితంగా ఆ గృహాలు ఖాళీగా, నిరుపయోగంగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. ఇలాంటి తప్పిదాలను పునరావృతం చేయకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని వెల్లడించారు. సౌకర్యవంతంగా ఉండేలా ఇండ్ల డిజైన్లను రూపొందించాలని, ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.






