జనసేన రాజ్యసభ అభ్యర్థి ఖరారు: పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటన

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై జనసేన పార్టీ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. జనసేన కోటా నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరును పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు.

జనసేన రాజ్యసభ అభ్యర్థి ఖరారు: పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై జనసేన పార్టీ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. జనసేన కోటా నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరును పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల పంపకాల్లో భాగంగా కూటమి ఒప్పందం ప్రకారం మూడు స్థానాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ), ఒక స్థానాన్ని జనసేన పార్టీ తీసుకోవాలని కూటమి నేతలు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో జనసేనకు దక్కిన ఏకైక రాజ్యసభ స్థానం ఎవరికి దక్కుతుందనే దానిపై గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడిచింది. మధ్యలో ఒకరిద్దరు ప్రముఖ నాయకుల పేర్లు జనసేన తరఫున రేసులోకి వచ్చినప్పటికీ.. పవన్ కల్యాణ్ మాత్రం మొదటి నుంచి పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపారు. పార్టీకి ఆయన చేసిన సేవలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని, పవన్ కల్యాణ్ ఆయన పేరును ఖరారు చేశారు. దీంతో జనసేన తరఫున పెద్దల సభకు వెళ్లే లక్కీ ఛాన్స్ లింగమనేని రమేశ్ను వరించింది.

Next Story