ఏన్కూర్‌లో దంచి కొట్టిన వాన.. విద్యుత్ సరఫరాకు అంతరాయం

by Kodari Anjali |   (  Updated:2026-06-05 14:41:37  IST  )

ఏన్కూర్‌లో శుక్రవారం సాయంత్రం వాతావరణం వచ్చిన మార్పులతో వర్షం దంచుకొట్టింది.

ఏన్కూర్‌లో దంచి కొట్టిన వాన.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
X

దిశ, ఏన్కూర్: ఏన్కూర్‌లో శుక్రవారం సాయంత్రం వాతావరణం వచ్చిన మార్పులతో వర్షం దంచుకొట్టింది. దీంతో జనజీవనం అతలాకుతలమయ్యారు. ఒక్కసారిగా వర్షం పడటంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వాహనాలు వర్షం నీటికి చిమ్మించి కొట్టడం జరిగింది. కొద్ది సమయం ఎదురు వచ్చే వాహనాలు కనపడక వాహనాలు నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పటివరకు ఋతుపవనాలు జాడ కనపడకుండా ముందే వర్షాలు ఆడబా తడప కొట్టడంతో పత్తి సాగు చేసే రైతులు విత్తనాలను నాటి అందుకు సిద్ధమయ్యారు.

విద్యుత్ పునరుద్ధరణ పనులలో అధికారులు..

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్తు పునరుద్ధరణ కోసం విద్యుత్ శాఖ అధికారులు శ్రమపడి ప్రజలకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షం వల్ల రోడ్లు మొత్తం బురద మాయమయ్యాయి.

Next Story