టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.1.11 కోట్లు విరాళం

by Vemula.Srinu Prasad |

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు ప్రతినిత్యం భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా రూ. 1.11 కోట్ల విరాళం టీటీడీకి అందింది. ..

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.1.11 కోట్లు విరాళం
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌(TTD SV Annaprasadam Trust)కు ప్రతినిత్యం భారీగా విరాళాలు(Donations) అందుతున్నాయి. తాజాగా సైతం రూ. 1.11 కోట్ల విరాళం టీటీడీకి అందింది. బెంగళూరుకు చెందిన వినాయక ఎంటర్‌ప్రైజెస్ ఎండీ మునిస్వామి నారాయణ గౌడ్(Vinayaka Enterprises MD Muniswamy Narayana Goud) టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.1.11 కోట్లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu)ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో జీవితంలో అభివృద్ధి సాధించిన భక్తులు తిరిగి శ్రీవారి సేవకు ముందుకు రావడం ఆనందదాయకమని చెప్పారు. క్యాంప్ కార్యాలయంలో తనను కలిసి విరాళం అందజేసిన సందర్భంగా 1984లో హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించి శ్రీవారి అనుగ్రహంతో అభివృద్ధి సాధించానని, స్వామివారిపై భక్తి భావంతో ఈ విరాళాన్ని సమర్పిస్తున్నానని మునిస్వామి నారాయణ గౌడ్ చెప్పినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. వారికి, కుటుంబ సభ్యులకు ఆ శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

టీటీడీ చైర్మన్ ట్వీట్..

Next Story