- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టులకు మొదటి విడత అక్రిడిటేషన్
జిల్లాలోని వివిధ దినపత్రికలు, చానల్స్ లలో పని చేస్తున్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హత మేరకు అక్రిడిటేషన్ కార్డులను అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : జిల్లాలోని వివిధ దినపత్రికలు, చానల్స్ లలో పని చేస్తున్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హత మేరకు అక్రిడిటేషన్ కార్డులను అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. మొదటి విడత కార్డులకు సంబంధించి శుక్రవారం తన ఛాంబర్ లో కమిటీ సభ్యులు , పలు దినపత్రికలు, చానల్స్ ల ప్రతినిధులకు అక్రిడేషన్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దినపత్రికలు, చానల్స్ వారీగా డిపిఆర్ఓ కార్యాలయం నుండి మొదటి విడత మంజూరైన కార్డులను పొందాలని సూచించారు. ఈ సందర్భంగా కార్డులు పొందిన ప్రతి ఒక్కరిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సహాయ సంచాలకులు మహమ్మద్ హబీబ్, డి ఈ వెంకట్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శంకర్ శిగ, నవీన్ కుమార్ యారా, మహమ్మద్ రఫియుద్దీన్ గౌరీ, కొమ్ము రాజు, మన్సూర్ అలీ , మోహనాచారి, దయానంద్, ప్రణీత , వివిధ పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు కర్నాటి గోపీనాథ్ , సునీల్ కుమార్, మహమ్మద్ హమీద్ ఖాన్, రాజశేఖర్, మహేష్, మల్లేష్ బాబు, బాలకృష్ణ, ఉపేందర్, దయాకర్ కుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






